సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతుంది. పోయిస్ గార్డెన్స్‌లోని రజనీ ఇంట్లో బాంబు పెట్టామని, అది ఏ క్షణాన్నైనా పేలుతుందని పేర్కొంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ రావండంతో వెంటనే పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయి రజనీ ఇంటికి చేరుకొని అణువణునా గాలించారు.
బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్‌తో రజనీ ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో కూడా గాలింపు చేపట్టారు. అయితే ఎంత వెతికినా బాంబ్ ఆచూకీ లభించకపోవడంతో అది ఫేక్ కాల్ అని కన్ఫర్మ్ చేశారు చెన్నై పోలీసులు. ఎవరో కావాలనే ఇలా అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని, రజనీ ఇంట్లో గానీ ఇంటి పరిసరాల్లో గానీ బాంబు లేదని వెల్లడించారు. ఈ క్రమంలో సదరు ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గతేడాది కూడా రజనీకాంత్ ఇంట్లో బాంబ్ ఉందంటూ ఫేక్ కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.