తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో వచ్చింది. దీంతో అక్కడి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో అజిత్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అజిత్ ఇంటిలో బాంబు పెట్టినట్లు అజ్ఞాత వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ తమిళనాడులోని విల్లుపురం జిల్లా నుంచి వచ్చిందని, త్వరలో కచ్చితమైన లోకేషన్‌ను గుర్తించి అజ్ఞాతవ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల హీరో విజయ్, రజనీకాంత్ ఇంటికి కూడా ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ కూడా విల్లుపురం జిల్లా నుంచి వచ్చిందే. అయితే ఆ కాల్‌ను భువనేశ్వర్ అనే వ్యక్తి చేసినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లగా అతడు మతిస్థిమితం లేనివాడని, అంగవైకల్యంతో బాధపడుతున్నాడంటూ అతడి కుటుంబ సభ్యులు పోలీసులను క్షమాపణలు కోరారు.