సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూరి జగన్నాథ్ కాంబినషన్లో ‘2006’ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’. ఈ సినిమా ఇండస్ట్రీ సూపర్ హిట్. ఈ మూవీ తరువా మరోసారి మహేష్ బాబు.. పూరి కాబినేషన్లో బిజినెస్ మెన్ వచ్చింది. ఆ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఈ కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.
ఇదిలా ఉంటె, పోకిరి సినిమాను బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. 2009లో ఈ సినిమాను రీమేక్ చేశారు. వాంటెడ్ పేరుతో రీమేకైనా ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. పోకిరి సినిమాకు తెలుగులో సీక్వెల్ చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అవి వార్తలకే పరిమితం అయ్యాయి. అయితే, బాలీవుడ్‌లో ఈ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘దబాంగ్ 3’ షూటింగ్ బిజీలో ఉన్నారు. ప్రభుదేవా దర్శకుడు. దీంతో పాటు త్వరలోనే సంజయ్ లీలా బన్సాలి ఇన్షాఅల్లా సినిమా తెరకెక్కబోతున్నది. ఇదిలా ఉంటె, వాటెండ్ సీక్వెల్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లేదా జనవరి నుంచి పట్టాలెక్కేబోతున్నట్టు తెలుస్తోంది. వాంటెడ్ సీక్వెల్ కు కూడా ప్రభుదేవానే దర్శకత్వం వహిస్తారట.