Bollywood heroine in Tollywood:
శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన నటి గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె తాజాగా నటించిన స్ట్రీ 2 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ లో సంచలనాలు సృష్టించింది. దీంతో ఆమె బాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగింది. కేవలం 19 సినిమాలతోనే ఆమె బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు 1638 కోట్ల రూపాయల్ని చేరాయి.
బాలీవుడ్ లో విజయాన్ని అందుకుంటున్న శ్రద్ధా కపూర్, తెలుగులో మాత్రం కొన్ని భారీ అవకాశాలను కోల్పోయింది. తాజాగా, ఆమెకు పుష్ప 2 చిత్రంలో ఒక ప్రత్యేక పాట కోసం ఆఫర్ వచ్చింది. కానీ ఆమె రూ. 8 కోట్ల డిమాండ్ చేయడంతో, నిర్మాతలు శ్రీలీలను ఎంపిక చేసుకున్నారు. శ్రీలీల ఈ పని కోసం రూ. 2 కోట్లకి ఒప్పుకుంది. దీంతో శ్రద్ధాకు ఒక మంచి అవకాశం కోల్పోయినట్లయింది.
View this post on Instagram
ఇప్పుడు, శ్రద్ధా మరో టాలివుడ్ అవకాశాన్ని కోల్పోయినట్లు వినిపిస్తోంది. నాని హీరోగా నటిస్తున్న.. ఒడెలా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లో శ్రద్ధా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. కానీ ఆమె రూ. 12 కోట్లు డిమాండ్ చేయడంతో.. అంతకంటే తక్కువ డిమాండ్ తో కొత్త హీరోయిన్ లను వెతకడం ప్రారంభించారు. ఈ చిత్రానికి మరొక కొత్త ముఖాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
మరోవైపు మృణాల్ రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా పనిచేసి ఇప్పుడు తెలుగు అమ్మాయిలగానే భారీ ఆఫర్లు అందుకుంటూ భారీ రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తోంది. శ్రద్ధా కపూర్ గతంలో ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించింది. కానీ ఆ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు రాలేదు. ఇప్పుడైనా శ్రద్ధ ఒక రెండు సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంటే.. టాలీవుడ్ నుండి కూడా ఆమెకి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోతారా?