
Kartik Aaryan Sreeleela relationship:
బాలీవుడ్ లో హీరోల ప్రేమ గాసిప్స్ కామన్. ఇప్పుడు కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ రూమర్స్ కి మరింత ఊపొచ్చింది కార్తిక్ తల్లి మాలా తివారి ఇచ్చిన సమాధానం వల్ల.
IIFA Awards 2025 సందర్భంగా కార్తిక్ తల్లిని, తన కొడుకు పెళ్లి గురించి ప్రశ్నించగా, ఆమె “మాకు మంచి డాక్టర్ కోడలు కావాలి” అని చెప్పింది. దీంతో, నెటిజన్లు శ్రీలీలనే కార్తిక్ భార్య అవుతుందేమో అని ఊహించేశారు. ఎందుకంటే, శ్రీలీల అసలు ప్రొఫెషన్ యాక్టింగ్ కాదు, ఆమె ఒక MBBS గ్రాడ్యుయేట్.
ఇంతకు ముందు కూడా శ్రీలీల, కార్తిక్ ఫ్యామిలీ పార్టీకి హాజరై, వారితో కలిసి సరదాగా ఎంజాయ్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారనేది మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అనురాగ్ బాసు దర్శకత్వంలో, భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఒక రొమాంటిక్ డ్రామాలో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. ఇది “ఆశికి 3” గా ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి.
కార్తిక్ తాజా మూవీలో “తూ మెరీ జిందగీ” పాటను స్టేజీపై పాడిన చిన్న క్లిప్ బయటికి వచ్చింది. ఇందులో ఆయన లాంగ్ హెయిర్, రఫ్ లుక్ తో కనిపించాడు. ఇది “ఆశికి 3” టీజరా? లేక మరో సినిమా అప్డేటా? అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
కార్తిక్ – శ్రీలీల మధ్య ఉన్న కెమిస్ట్రీ, వీరి మధ్య నిజంగానే ఏదైనా ప్రేమ సంబంధమా? లేక మామూలు ఫ్రెండ్‌షిప్ మాత్రమేనా? అనేది కాలమే నిర్ణయించాలి!