మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌లో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ దున్నేస్తోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు మధ్యలో స్పెషల్ సాంగ్స్‌తో చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘బోళా శంకర్’లో హీరోయిన్‌గా నటించింది. రజనీకాంత్ మూవీ జైలర్‌లో హీరోయిన్.
కోలీవుడ్‍లో సూపర్ స్టార్ రజినీ కాంత్ మూవీ ‘జైలర్’ లో హీరోయిన్‍గా చేస్తోంది. ఇటీవలే జైలర్ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా డ్యాన్స్ దుమ్ము రేపింది. చాలామంది తమన్నాను ఇండియా షకీరా అంటున్నారు. ఇటీవల వెబ్‌సిరీస్‌లో బోల్డ్ సీన్‌లో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
తమన్నా తాజాగా మరో బాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పింది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న ‘వేదా’ అనే చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషించబోతుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందించనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్‍లో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
ఈ మూవీలో ఇప్పటికే ఓ హీరోయిన్‌గా శార్వరీ వాఘ్ ఉంది. ఇప్పుడు తమన్నా కూడా జాయిన్ అయింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ గురువారం ప్రకటించింది. జాన్ అబ్రహం, దర్శకుడు నిఖిల్‌తో దిగిన ఫొటోలను తమన్నా ట్విట్టర్‌లో షేర్ చేసింది.
వేదా చిత్రాన్ని జీ స్టూడియోస్, ఇమాయ్ ఎంటర్‌టైన్‍మెంట్స్, జేఏ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అసీమ్ అరోరా కథ అందించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.