బాలీవుడ్‌లో కొత్త జంటలపై బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్(KRK) వివాదస్పద ట్వీట్ చేశాడు. ‘బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ముందు గర్భం దాల్చడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు బాలీవుడ్ లో పెళ్లి చేసుకున్న కొత్త జంటది కూడా ఇదే ఫార్ములా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
తాజాగా బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కియారా అద్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు ఈ నెల 7న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని ఓ ప్యాలెస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరిని ఉద్దేశించే కేఆర్‌కే వ్యాఖ్యానించినట్లు టాక్. మరోవైపు గత ఏడాది ఏప్రిల్ 14న అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి చేసుకున్న సంగతి విదితమే.
పెళ్లికి ముందే అలియా గర్భం దాల్చిందనే విషయం ఆ తర్వాత వెల్లడయింది. పైళ్లైన ఏడు నెలలకే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కియారా కూడా అలియా బాటలోనే వెళ్లిందా. కియారా కూడా ప్రెగ్నెంట్ అయినందు వల్లనే వారు సడెన్‌గా పెళ్లి చేసుకున్నారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Bollywood’s new trend is, that first get pregnant and then get married. According to sources, Bollywood Ki recently Huyee Marriage Ka Bhi Yahi Formula Hai. Accha Hai.
— KRK (@kamaalrkhan) February 12, 2023
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు