HomeTelugu Trendingబాలీవుడ్‌ సంగీత దర్శకుడు మృతి

బాలీవుడ్‌ సంగీత దర్శకుడు మృతి

2
బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు వాజీద్ ఖాన్ (42) గత రాత్రి కన్నుమూశారు. నెల రోజుల క్రితమే ఆయన కిడ్నీ మార్పిడి చేసుకోగా, కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ సంక్రమించింది. బాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన వాజిద్ లాక్‌డౌన్ సమయంలో నటుడు సల్మాన్ ఖాన్ ‘భాయ్ భాయ్’ పాటకు సంగీతం అందించారు.

వాజిద్ మృతి వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వాజీద్ మరణాన్ని నమ్మలేకున్నానని, ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని సింగర్ హర్షదీప్ పేర్కొన్నారు. వాజీద్ ఖాన్ నవ్వు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu