Bollywood heroines who can’t vote in India:
బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. మొత్తం 4,136 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు.
ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ముందుగా ఓటు హక్కును వినియోగించారు. సోను సూద్, అక్షయ్ కుమార్, రాజ్‌కుమార్ రావు, గౌతమీ కపూర్, అలీ ఫజల్ వంటి ప్రముఖులు తమ ఓటును వేయగా, ప్రజలను ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. సోను సూద్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత ముఖ్యమో గుర్తు చేశారు.
అయితే, కొంత మంది బాలీవుడ్ తారలు భారతీయ ఎన్నికల్లో ఓటు వేయలేరు. దానికి కారణం వారు విదేశీ పౌరులుగా ఉండటమే. భారత ఎన్నికల్లో ఓటు వేయలేని కొంతమంది ప్రముఖుల గురించి తెలుసుకుందాం.
1. Alia Bhatt:
బాలీవుడ్‌లో అగ్రతారగా ఉన్న అలియా భట్ భారతీయ ఎన్నికల్లో ఓటు వేయలేరు. ఆమె బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్‌లో జన్మించడంతో బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అనుమతించబడదు, కాబట్టి ఆమె బ్రిటిష్ పాస్‌పోర్ట్‌ను వదులుకోకపోతే ఓటు వేయలేరు.
2. Katrina Kaif:
బాలీవుడ్ సూపర్‌స్టార్ కత్రినా కైఫ్ బ్రిటిష్ – హాంకాంగ్‌లో జన్మించారు. ఆమె బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉండడంతో, భారతదేశంలో ఓటు వేయడం సాధ్యపడదు.
3. Nora Fatehi:
తన డాన్స్ పర్‌ఫార్మెన్స్‌లతో పేరు తెచ్చుకున్న నోరా ఫతేహి కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారు. విదేశీ పాస్‌పోర్ట్ కారణంగా, ఆమె భారతీయ ఎన్నికల్లో ఓటు వేయలేరు.
4. Jacqueline Fernandez:
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బహ్రెయిన్‌లో జన్మించారు. ఆమె శ్రీలంక పౌరసత్వం కలిగి ఉండడంతో భారత ఎన్నికలలో పాల్గొనలేరు.
భారతదేశంలో ఓటు హక్కు వినియోగించేందుకు భారతీయ పౌరసత్వం అవసరం. ద్వంద్వ పౌరసత్వం అనుమతించబడదు కాబట్టి విదేశీ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఓటు వేయలేరు.
ALSO READ: విడాకుల విషయంలో AR Rahman పై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్.. ఎందుకంటే!