HomeTelugu Newsఅక్షయ్‌ కుమార్‌పై నెటిజన్ల ప్రశంసలు

అక్షయ్‌ కుమార్‌పై నెటిజన్ల ప్రశంసలు

11 23
కరోనా పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు తమకు తోచిన విధంగా ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రూ. 25 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. భారతీయ సినీ పరిశ్రమలో ఇంత పెద్దమొత్తం విరాళంగా ప్రకటించిన వారిలో ఎవరూ లేరని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినీ కెరీర్ ప్రారంభంలో తన వద్ద ఏమీ లేదని, ఇప్పుడు ఇచ్చే స్థాయిలో ఉన్నాను కాబట్టి.. నిరు పేదలకు నేను చేయగలిగిన సాయం చేస్తానని అన్నాడట అక్షయ్ కుమార్. అక్షయ్ నటుడిగానే కాకుండా పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. గతేడాది పోర్బ్స్ ప్రకటించిన అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితాలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు అక్షయ్. ఈ హీరోని నెటిజన్ను ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu