టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌పై విమర్శలు చేసింది. సౌత్ ఇండస్ట్రీలో నైతికత, విలువలు, క్రమశిక్షణ ఉన్నాయి కానీ బాలీవుడ్‌లో అవి లోపించాయని కాజల్ ఆరోపించింది. టాలెంట్ ఉంటే సౌత్ ప్రేక్షకులు ఎవరినైనా అంగీకరిస్తారని అంది.
జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ ‘సౌత్ వర్సెస్ బాలీవుడ్’ అనే అంశంపై మాట్లాడుతూ నేను ముంబై అమ్మాయిని. కానీ నాకు మొదట అవకాశమిచ్చింది మాత్రం టాలీవుడ్. ఉత్తరాది అమ్మాయినైనా తెలుగు, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా పనిచేశాను అంది.
బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్, చెన్నై నా పుట్టినిల్లుగా భావిస్తాను. నేను సినిమాల్లో ఉన్నా లేకున్నా ఈ విషయంలో మార్పు ఉండదు. జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం ఎక్కువ మంది హిందీ సినిమాల్లో నటించాలనుకుంటారు. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. బాలీవుడ్‌లో అలా ఉండదు అంది.
ప్రతిభ ఉంటే ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారు. టాలెంటెడ్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మంచి కథలు వస్తున్నాయి. నా మాతృభాష హిందీ కావడంతో బాలీవుడ్ చిత్రాలు చూస్తూ పెరిగాను. బాలీవుడ్‌లో కూడా నాకు మంచి ఆఫర్లు వచ్చాయి.
కానీ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్‌లో లోపించాయనేది నా అభిప్రాయం అంది కాజల్ అగర్వాల్. ఆమె వ్యాఖ్యలపై బాలీవుడ్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు