బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో రకుల్, నమ్రత పేర్లు బయటికి రావడంతో టాలీవుడ్ సెలబ్రిటీల్లో అలజడి మొదలైంది. టాలీవుడ్ డ్రగ్స్ కేస్ వివరాలను కూడా ఎన్‌సీబీ తీసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ వ్యాపారవేత్తలు, విద్యార్థుల డ్రగ్స్ వ్యవహారంపై టాలీవుడ్ డ్రగ్స్ కేస్ వివరాలను కూడా ఎన్‌సీబీ తీసుకున్నట్టు తెలుస్తోంది ఎక్సైజ్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి 12 కేసుల్లో ఉన్న అందరి శాంపిల్స్ సేకరించామని పేర్కొన్నారు. అయితే కొంతమంది టాలీవుడ్ నటుడు శాంపిల్స్ ఇవ్వడానికి వెనుకంజ వేశారన్న ఆయన శాంపిల్స్ ఇచ్చి కౌన్సెలింగ్ పొందినవారి పేర్లను ఛార్జ్ షీట్ లో పెట్టలేదని అన్నారు.
అలానే కొంత మంది నటులు పునరావాస కేంద్రంలో ఉండలేదని ఆయన అన్నారు. కేవలం కౌన్సెలింగ్ తీసుకోని వారి పేర్లను ఛార్జ్‌షీట్ లో పొందుపరిచామని ఆయన అన్నారు. ఆ ఛార్జ్ షీట్ లో పేరున్న వారికి రెండేళ్ల వరకు శిక్ష పడుతుందని వివేకానంద రెడ్డి పేర్కొన్నారు. 72 మంది శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించామన్న ఆయన విదేశాల నుంచి పెద్ద మొత్తంలో టాలీవుడ్ కు డ్రగ్స్ చేరుకుంటున్నాయని అన్నారు. టాలీవుడ్ లో కొందరి వ్యక్తిగత సహాయకుల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమాచారాన్ని ఎన్సీబీ ఇప్పటికే తీసుకుందని ఆయన పేర్కొన్నారు.