HomeTelugu News"వడ చెన్నై" ను మెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు

“వడ చెన్నై” ను మెచ్చుకున్న బాలీవుడ్ దర్శకుడు

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన “వడ చెన్నై” సినిమా అద్భుతంగా ఉందని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అన్నారు. ఐశ్వర్య రాజేశ్‌, ఆండ్రియా, సముద్ర ఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వెట్రి మారన్ దర్శకత్వం వహించారు. వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ధనుష్‌ వడ చెన్నై సినిమాను నిర్మించారు. సంతోష్‌ నారాయణ్‌‌ బాణీలు అందించగా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పించింది.‌ అక్టోబరు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.

8 13

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన అనురాగ్‌ సోషల్‌మీడియా వేదికగా అభిప్రాయం పంచుకున్నారు. “వడ చెన్నై” నిజమైన గ్యాంగ్‌స్టర్‌ చిత్రం. వెట్రిమారన్‌.. నువ్వు ఎప్పటికీ అద్భుతమైన దర్శకుడివే. సినిమాలో నటించిన ఆండ్రియా, సముద్రఖని, ధనుష్‌.. సెంథిల్‌, రాజన్‌, పద్మ పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు చక్కటి ప్రదర్శన కనబర్చారు. సినిమాలో ధనుష్‌ సోదరుడు కన్నన్‌ పాత్ర పోషించిన నటుడ్ని చాలా మెచ్చుకోవచ్చు” అంటూ అనురాగ్‌ కశ్యప్ వరుస ట్వీట్లు చేశారు. “వడ చెన్నై” టీజర్‌ ఆసక్తికరంగా ఉందని ఇటీవల ప్రముఖ కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu