టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున త్వరలో ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజుఅనే సినిమా చేయనున్నట్లుగా గత కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తుండగా, ఈ చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నాడు. మరో వైపు ‘గరుడవేగ’ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో నాగార్జున ఓ యాక్షన్ థ్రిల్లర్ కథ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ సత్తారు- నాగార్జున సినిమా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా, ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్ అనే కొత్త బ్యూటీ నాగ్ రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది . మరోవైపు కీలక పాత్రలో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ నటించబోతున్నారని సమాచారం. ఈ వార్త నిజమైతే గుల్ పనాగ్‌కు ఈ చిత్రం తెలుగులో తొలి సినిమా కానుంది. ఈ చిత్రాన్ని శరత్ మరార్ తో కలిసి ఏషియన్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.