బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్‌కుంద్రాతో విడిపోయి తన పిల్లలతో కలిసి జీవించాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు వినికి. పోర్న్ వీడియో యాప్ట్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు.
రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో శిల్పా శెట్టి ఆమె కుటుంబం గడ్డు పరిస్థితులు చూస్తున్నారు. అవమానంతో కొద్ది రోజులుగా ఆమె బయటకు కూడా రావడం లేదు. ఇటీవల తిరిగి షూటింగ్‌లకు హాజరవుతున్న శిల్పాశెట్టి ‘నేను తప్పు చేశానంటూ’ ఓ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘తప్పులు మానవ సహజం. తప్పు చేయకుండా ఎవరూ ఉండదు. కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులకు బాధ కలిగించేలా ఉండకూడదు. తప్పు చేశాను కానీ వాటిని సరిదిద్దుకుంటాను’ అంటూ ఆమె పోస్ట్‌లో పేర్కొనడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.