HomeTelugu Trendingఆ నిర్మాత డేట్‌కు రమ్మన్నాడు: కల్కి కొచ్లిన్‌

ఆ నిర్మాత డేట్‌కు రమ్మన్నాడు: కల్కి కొచ్లిన్‌

1 25బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌.. ఓ నిర్మాత పరోక్షంగా తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న సమస్యల గురించి తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. 2013లో రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొణెతో కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలో నటించినప్పటికీ అవకాశాలు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ సినిమా విడుదల తర్వాత నాకు తొమ్మిది నెలలపాటు ఎటువంటి ఆఫర్‌ రాలేదు. ఖాళీగా ఉన్నాను. హిట్‌ వచ్చినప్పటికీ ఇలా జరగడం బాధగా అనిపించింది’ అని కల్కి పేర్కొన్నారు.

అనంతరం లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఓ నిర్మాత నన్ను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వేధించాడు. తనతోపాటు డేట్‌కు రావాలని అడిగాడు. నేను దానికి ఒప్పుకోలేదు. దీంతో నన్ను ఆ సినిమాకు వద్దనుకున్నాడు. గతంలోనూ వేధింపుల గురించి నేను మాట్లాడాను. ఈ విషయం తొలుత నా థెరపిస్ట్‌కు, ఆ తర్వాత నా బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పాను. ఇలాంటి ఘటనలు బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ ఉన్నాయి. నేను హాలీవుడ్‌కు వెళ్లినప్పుడు అక్కడి క్యాస్టింగ్‌ ఏజెంట్‌ నా ముఖం దగ్గరికి వచ్చి.. కళ్లకిందున్న వలయాలు చూశాడు. ‘దేవ్‌ డి’ సినిమాలో నన్ను చూసి కొందరు ‘రష్యన్‌ వేశ్య’ అన్నారు. ‘ఈ రష్యన్‌ వేశ్యను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?’ అని అన్నారు. ‘నేను రష్యన్‌ను కాదు’ అని చెప్పుకోవాల్సి వచ్చింది ‘ అని ఆమె చెప్పారు. ‘దేవ్‌ డి’ సినిమాలో కల్కి వేశ్య పాత్రను పోషించారు. కల్కి త్వరలో ఓ శిశువుకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల నెట్‌ఫ్లిక్‌ ”సేక్రెడ్‌ గేమ్స్‌’లో కనిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu