సినీతారలు మరింత అందంగా కనిపించేందుకు శరీరంలో మార్పులు చేయించుకుంటారు. ఇందుకోసం చాలా మంది సర్జరీలు చేయించుకుని వారి అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే ఇవి అందరికి కలిసిరాకపోవచ్చు. ఇప్పుడు అదే జాబితాలో దిషా పటానీ చేరిపోయింది అంటున్నారు. దీనిపై బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిపై ట్రోలింగ్ జరుగుతోంది.
శుక్రవారం ముంబైలో జరిగిన సల్మాన్ ఖాన్ ‘యాంటిమ్’ సినిమా స్క్రీనింగ్‌లో దిషా పటానీ అద్భుతంగా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దిశా పసుపు రంగు క్రాప్ టాప్, డెనిమ్స్‌లో హాట్‌గా కనిపించింది. ఈ ఈవెంట్ లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మేరకు దిశా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొంతమంది ఆమె ఈ ఈవెంట్‌లో కనిపించిన తీరు అసాధారణంగా ఉందని అంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దిశా ఫోటోలు, వీడియోలలో ఆమె చాలా భిన్నంగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. దిశా తన రూపాన్ని మెరుగుపరచుకోవడానికి ముక్కు లేదా పెదవుల సర్జరీని చేయించుకోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ ‘యాంటీమ్’ ఈవెంట్ దిశా తన ముఖానికి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు పుకార్లకు దారి తీసింది. సర్జరీతో ముఖాన్ని నాశనం చేసుకున్న మరో హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.