HomeTelugu Big Storiesషాక్‌లో బాలీవుడ్‌.. 19ఏళ్ల నటి మృతి!

షాక్‌లో బాలీవుడ్‌.. 19ఏళ్ల నటి మృతి!

bollywood child artist

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమీర్ తో పాటు ప్రధాన పాత్రల్లో హీరో కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్ కూడా తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ సినిమా తరువాత ఈ ముగ్గురికి ఇండస్ట్రీలో చాలా ఆఫర్లు ఎదురు వచ్చాయి. ఆ ఆఫర్స్ ని ఫాతిమా, సన్యా అందిపుచ్చుకొని వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చారు. కానీ సుహాని మాత్రం.. యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకోని చదువు పై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఆ క్రమంలోనే సినిమాలకు దూరమైంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ ని పలకరిస్తూ ఉండేది. తాజాగా ఆమె అభిమానులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. 19 ఏళ్ళ వయసులోనే సుహాని మరణించి అందర్నీ ఆశ్చర్యనికి గురిచేసింది.

కొన్నేళ్ల క్రిందట సుహానికి ప్రమాదం అయ్యి కాలుకి గాయం అయ్యింది. ఇక ఆ చికిత్స సమయంలో తీసుకున్న కొన్ని మందులు సుహాని పై దుష్ప్రభావం చూపాయి. దీంతో ఆమె శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోవడంతో.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న లాభం లేకుండా పోయింది. చిన్న వయసులోనే ఆమె కన్నుమూసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu