బాలీవుడ్లో దివంగత నటుడు రాజ్ కపూర్-కృష్ణ కపూర్లకు చిన్న కుమారుడు రాజీవ్ కపూర్ కుమారుడు రిషి కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్(58) మృతి చెందారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన రాజీవ్ కపూర్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రాజీవ్ కపూర్ ఫొటో షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అదే విధంగా రాజీవ్ మృతిపట్ల అన్నయ్య రణధీర్ సంతాపం ప్రకటించారు. నేను నా తమ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. అతను ఇక లేడు. వైద్యులు తమ వంతు ప్రయత్నించినా తనను రక్షించుకోలేకపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ కపూర్ ‘రామ్ తేరి గంగా మెయిలీ’ చిత్రంలోని నరేంద్ర పాత్రతో గుర్తింపు పొందాడు. ఈ చిత్రం 1985 సంవత్సరంలో విడుదలైంది. అనంతరం ‘ఏక్ జాన్ హై హమ్’ (1983) చిత్రంలో నటించారు. రిషి కపూర్ హీరోగా నటించిన ‘ప్రేమ్ గ్రంథ్’కు దర్శకత్వం వహించారు.