Arshad Warsi about Prabhas
యంగ్ రెబల్ స్టార్ Prabhas హీరోగా నటించిన కల్కి 2898 సినిమా ఈ మధ్యనే బాక్స్ ఆఫీస్ వద్ద స్థాయిలో కలెక్షన్లు అందుకుంది ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబచ్చన్ దీపికా పడుకొనే కూడా ఈ సినిమాలో కనిపించారు అయితే తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ Kalki 2898 AD సినిమా గురించి చెప్పిన అర్షద్ వార్సి తనకి సినిమా అసలు నచ్చలేదు అని అన్నారు సినిమాలో Prabhas ఒక జోకర్లా కనిపించారు. అతన్ని ఒక మ్యాడ్ మ్యాక్స్ హీరో పాత్రలో చూపించాలి కానీ అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్థం కాదు” అంటూ అర్షద్ వార్సి సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు. బాలీవుడ్ లో చిన్నాచితక పాత్రలు చేసే అతను గ్లోబల్ స్టార్ అయినా ప్రభాస్ గురించి మాట్లాడే హక్కు కూడా లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కావాలనే బాలీవుడ్ నటులు పెరిగిపోతున్న టాలీవుడ్ క్రేజ్ చూసి ఓర్వలేక పోతున్నారు అని అందుకే ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు.
ఒకప్పుడు భారత భారతీయ సినిమా అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బాలీవుడ్ కానీ ఇప్పుడు బాలీవుడ్ ని దాటేసి టాలీవుడ్ 10 అడుగులు ముందుకు వేసేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు నటుడు కూడా ఈర్ష్య చెందుతున్నారు అని.. ఛాన్స్ వచ్చినప్పుడల్లా తెలుగు సినిమాల మీద ఇలాంటి కామెంట్లు చేసి పాపులారిటీ సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.
సినిమాలో ప్రభాస్ పాత్ర ఎక్కువ కనిపించకపోయినా కూడా క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కేవలం క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లో ఆఖరి అరగంట కోసమే చాలామంది ఈ మళ్ళీ మళ్ళీ సినిమాను చూసిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ సినిమాకి మెయిన్ సెల్లింగ్ పాయింట్ ప్రభాస్. హిందీలో ఏ డైరెక్టర్ కూడా చూపించలేనటువంటి విధంగా అమితాబచ్చన్ ను చూపించారు తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
ఏదేమైనా ప్రభాస్ సక్సెస్ చూడలేకపోతున్న బాలీవుడ్ నటులు కావాలనే ప్రభాస్ పేరుని వాడుకొని ఇలా తప్పుడు దారులలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చాలామంది అభిప్రాయపడుతున్నారు.