కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇప్పుడు ఆపద్బాంధవుడయ్యాడు. సాయం కోసం ఆపన్నులు అర్థించిన వెంటనే నేనున్నాంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తున్నాడు. ఇటీవల ఓ ఫౌండేషన్ స్థాపించిన సోనూసూద్ దాని ద్వారా తన సహాయ కార్యక్రమాలను మరింత విస్తృతం చేశాడు. తాజాగా ఆ ఫౌండేషన్‌కు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన యూట్యూబర్, అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి రూ. 15 వేలను విరాళంగా ఇచ్చి సోనూ సూద్ చేస్తున్న సాయంలో భాగస్వామి అయింది. ఇవి తన తన 5 నెలల పెన్షన్ డబ్బులు కావడం విశేషం. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఓ చిన్న గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన ఫౌండేషన్‌కు రూ. 15 వేలు విరాళం పంపిందని, తనవరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలని ఆమేనని ప్రశంసలు కురిపించాడు. వేరొకరి బాధను చూడడానికి నేత్రాలు అవసరం లేదని పేర్కొన్నాడు.
Boddu Naga Lakshmi
A Blind girl and a youtuber.
From a small village Varikuntapadu in andra Pradesh
Donated 15000 Rs to @SoodFoundation & that’s her pension for 5 months.
For me she’s the RICHEST Indian.
You don’t need eyesight to see someone’s pain.
A True Hero🇮🇳 pic.twitter.com/hJwxboBec6— sonu sood (@SonuSood) May 13, 2021