HomeTelugu Trendingమంచు విష్ణుకి బ్లాక్ మెయిల్ లెటర్‌!!

మంచు విష్ణుకి బ్లాక్ మెయిల్ లెటర్‌!!

2 29హీరో మంచు విష్ణుకి బ్లాక్ మెయిల్ లెటర్‌ వచ్చిందంట. హీరో మంచు విష్ణు ఏమిటి, బ్లాక్ మెయిల్ కు గురవడమేమిటని అనుకుంటున్నారా. ఈ బ్లాక్ మెయిల్ ను విష్ణు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బ్లాక్ మెయిల్ చేసింది ఎవరో కాదు విష్ణు కుమార్తె వివి. వివి బర్త్ డే త్వరలోనే రాబోతోంది. ఆ రోజున తనకు ఇష్టమైన రోలర్ స్కేట్స్ ను తండ్రి నుండి గిఫ్ట్ గా పొందడం కోసం నాన్న నువ్వు నాకు ఈ ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన వ్యక్తివి. నేను ఏం అడిగితే అది కొనిస్తావ్. నా పుట్టినరోజుకి రోలర్ స్కేట్స్ కొనివ్వు అంటూ లెటర్ రాసిందట వివి. ఆ లెటర్ చూసిన విష్ణు ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అంటూ కుమార్తె చేసిన పనికి ముచ్చటపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu