బాలీవుడ్ సుశాంత్ సింగ్ మృతిపై మరోసారి బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ విష ప్రయోగం వల్లే చనిపోయాడంటూ సంచలనానికి తెరలేపారు. పోస్టుమార్టం చేసేందుకు కావాలనే ఆలస్యం చేసినట్టు తెలిపారు. సుశాంత్ శరీరంలో విషంయొక్క ఆనవాళ్లు పోయేంతవరకు వేచి చూశారన్నారు. హంతకుల రాక్షస మనస్తత్వం త్వరలోనే బయడే సమయం ఆసన్నమయిందని అన్నారు. సుశాంత్ స్నేహితుడు సందీప్‌సింగ్‌పైనా సుబ్రహ్మణ్యస్వామి అనుమానాలు వ్యక్తం చేశారు. సందీప్‌సింగ్ పదే పదే దుబాయ్‌కి వెళ్లడంపైనా విచారణ జరగాల్సి ఉందన్నారు. సుశాంత్ ఇంటి పని వారితో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న అందరినీ విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.సుశాంత్ మృతిపై మొదటి నుంచీ సుబ్రహ్మణ్య స్వామి హత్యగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక సుశాంత్ కేసు మాదిరిగానే ప్రముఖ నటి శ్రీదేవి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులను కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలే సుశాంత్ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈడీ, ఐటీ అధికారులతో పాటు, పోలీసుల విచారణ జరుగుతోంది.