Homeతెలుగు Newsరాహుల్‌పై మరోసారి ధ్వజమెత్తిన బీజేపీ

రాహుల్‌పై మరోసారి ధ్వజమెత్తిన బీజేపీ

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బీజేపీపై మరోసారి ధ్వజమెత్తారు. ఓవైపు సర్దార్‌ వల్లభాయ్‌‌ పటేల్‌ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ.. మరోవైపు ఆయన సాయం చేసిన ఎన్నో సంస్థలను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇలా చేయడం రాజద్రోహం కన్నా తక్కువేం కాదని దుయ్యబట్టారు.

8 17

ప్రపంచంలోనే అతి ఎత్తయిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ ట్విటర్ వేదికగా బీజేపీపై విమర్శల దాడికి దిగారు. “సర్దార్‌ పటేల్‌ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు బాగానే ఉంది. కానీ, ఆయన బలోపేతం చేసిన ఎన్నో సంస్థలను నేడు నాశనం చేస్తున్నారు. భారతీయ సంస్థల వ్యవస్థీకృత విధ్వంసం రాజద్రోహం కన్నా తక్కువేం కాదు” అని ట్వీట్ చేశారు.

రాహుల్‌ అంతకుముందు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు నివాళులర్పించారు. “దేశ స్వాతంత్ర్యం, సమైక్య భారతం కోసం పోరాడిన గొప్ప దేశభక్తుడు సర్దార్‌ పటేల్‌. ఆయనది ఉక్కు సంకల్పం. మతోన్మాదాన్ని సహించని వ్యక్తి. నేడు ఆయన జయంతి సందర్భంగా.. భారత పుత్రుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నా” అని రాహుల్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu