BJP against Jagan:
2014 నుంచి 2019 దాకా బిజెపి ఎంత టిడిపి తో పొత్తులో ఉన్నప్పటికీ.. చాలావరకు వైసీపీకి సపోర్ట్ గానే పనిచేసింది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. దీని వలన టిడిపి, బిజెపి మధ్య గొడవలు కూడా జరిగాయి. వాళ్ళ పొత్తు కూడా చెడిపోయింది.
కానీ ఇప్పుడు పవర్ లో ఉన్న పార్టీతో పాటు పరిస్థితులు కూడా మారాయి. ఇంతకుముందు వాడిన ఆయుధాలు ఏమీ ఇప్పుడు పని చేయవు అని బిజెపికి బాగా అర్థం అయింది. దీంతో బీజేపీకి కూడా వైసీపీకి వ్యతిరేకంగా మారిపోయింది. సోము వీర్రాజు కూడా ఇప్పుడు చాలా మౌనంగా ఉండిపోయారు.
తాజాగా ఇప్పుడు జీవిఎల్ నరసింహారావు వైసీపీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ జగన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఈ మధ్యనే నారా లోకేష్ కమ్యూనిస్ట్ పార్టీలకు క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ స్థానంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ మధ్యకాలంలో ఒక క్షమాపణలు చెప్పింది లేదు. అసలు రాజకీయాల్లో సారీ అనే పదానికి చోటే లేదు.
కానీ నారా లోకేష్ క్షమాపణలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే జీవీఎల్ నరసింహారావు కూడా లోకేష్ ను కొనియాడుతూ ట్వీట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. చూస్తూ ఉంటే ఇకపై ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు అసలు రాజకీయాల్లోనే జగన్ కి భవిష్యత్తు లేదు అని.. వైసిపి తో పాటు బిజెపి కూడా ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు.
బిజెపిలో ఈ మార్పు జగన్ జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అని చెప్పుకోవచ్చు. అయినా నిన్న మొన్నటిదాకా వైసీపీకి జిందాబాద్ కొట్టిన నాయకులు కూడా.. ఇప్పుడు ప్లేట్ మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, వైసీపీకి వెన్ను చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పొచ్చు.