చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేను ఊరిలోకి రాకుండా కేబీఆర్ పురంలో ఆ పార్టీ నాయకులే అడ్డుకున్నారు. సొంత పార్టీ నాయకులకు కాకుండా టీడీపీ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ గ్రామ సచివాలయ శంకుస్థాపనకు వచ్చిన రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని గ్రామస్థులకు సర్దిచెప్పారు.