HomeTelugu Big Stories'RRR' నుండి ఎన్టీఆర్‌ లవర్‌ (ఒలివియా మోరీస్) లుక్‌

‘RRR’ నుండి ఎన్టీఆర్‌ లవర్‌ (ఒలివియా మోరీస్) లుక్‌

Birthday Wishes to olivia m
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘RRR’. ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హాలీవుడ్‌ హీరోయిన్‌ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా చేస్తోన్న తారక్ సరసన ఇంగ్లీష్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో మేకర్స్ విషెష్ చెప్పడంతో పాటుగా ఆమె లుక్.. ఆమే పాత్ర పేరును ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాలో కొమరం భీమ్ లవర్ పేరు జెన్నిఫర్ అని ప్రకటించింది చిత్రబృందం. దాంతో పాటు ఆమె లుక్‌ను కూడా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో ఇంగ్లీష్ నటులతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu