కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ కారణంగా సోనూసూద్‌లోని రియల్ మనస్వత్వం ప్రపంచానికి తెలిసింది. ఎక్కడ ఎవరికీ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకు కదిలాడు. 20 ఏళ్లలో తాను కష్టపడి సంపాదించిన డబ్బులను మంచినీళ్లప్రాయంలా ఖర్చుచేశాడు. రీల్ హీరో నుండి రియల్ హీరో గా మారాడు. సోనూసూద్ మరో మంచి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు (జులై 30) ఆయన ’47వ’ పుట్టినరోజు. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు. వాటి ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు ఆయన తెలిపారు. సోనూసూద్ వైద్య శిబిరాలను గ్రామ పంచాయతీల సమన్వయంతో నిర్వహించాలని భావిస్తున్నారు. సామాజిక దూరం పాటించేలా నిబంధనలను అమలు చేస్తూ శిబిరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడిశాకు చెందిన పలువురు వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. కాగా సోనూసూద్‌కు ప్రముఖులు, హితులే కాదు.. నెటిజన్లు, ప్రజలు మనస్ఫూర్తిగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు.