ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన ఇద్దరు పిల్లల బాధ్యతను మోస్తున్నారు. అయితే ఇటీవల కరిష్మా తన 45వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడి సముద్రతీరంలో బికినీ వేసుకుని దిగిన ఫొటోను కరిష్మా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఎంత వయసు వచ్చినా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఎన్నో కామెంట్లు వచ్చాయి. ఆమె 45 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్‌గా, అందంగా ఉన్నారంటూ కొందరు, ఈ వయసులో ఇలాంటి దుస్తులేంటి? అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. ఫొటో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే లక్షకు పైగా లైకులు వచ్చాయి. కత్రినా కైఫ్, అమృతా అరోరా, ఆథియా శెట్టి, కియారా అద్వాణీ వంటి నటీమణులు కూడా కరిష్మా అందానికి ఫిదా అయ్యారు. కరిష్మా ఫొటోలు మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2018లో వచ్చిన ‘జీరో’ చిత్రంలో కరిష్మా అతిథి పాత్రలో కనిపించారు. సినిమాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తనదేనని ఒకానొక సందర్భంలో వెల్లడించారు.