HomeTelugu NewsBird Flu: కొవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకం.. ముంచుకొస్తున్న వైరస్‌

Bird Flu: కొవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకం.. ముంచుకొస్తున్న వైరస్‌

Bird FluBird Flu: ప్రస్తుత పరిస్థితుల్లో.. బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలల క్రితం ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. లక్షల సంఖ్యలో కోళ్ల ప్రాణాలను తీసింది. అయితే తాజాగా ఈ వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తోంది. ఇటీవలే ఫ్లూ రెండవ కేసు అమెరికాలో నిర్ధారించబడింది.

క‌రోనా కంటే ప్రాణాంత‌క‌మైన బ‌ర్డ్‌ఫ్లూ మాన‌వాళిపై విరుచుకుప‌డే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని ప‌లువురు నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బ‌ర్డ్‌ఫ్లూలోని హెచ్5ఎన్1 ర‌కం వైర‌స్ మ‌హమ్మారిగా మార‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ‘డెయిలీకరోనా కంటే ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

బర్డ్‌ఫ్లూలోని హెచ్‌5ఎన్‌1 రకం వైరస్‌ మహమ్మారిగా మారవచ్చని అంటున్నారు. ఈ బర్డ్‌ఫ్లూకు మానవాళి చేరువవుతున్నదని, ఈ వైరస్‌ మనుషులతో పాటు జంతువులకు కూడా వ్యాపించవచ్చని అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు చెందిన బర్డ్‌ఫ్లూ పరిశోధకులు డాక్టర్‌ సురేశ్‌ కూచిపూడి పేర్కొన్నారు. ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చే వైరస్‌ కాదని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నదేనని తెలిపారు.

దీనిని ఎదుర్కొనేందుకు వెంటనే సిద్ధం కావాల్సి ఉందన్నారు. కెనడాకు చెందిన ఫార్మారంగ నిపుణులు జాన్‌ ఫౌల్టన్‌ కూడా బర్డ్‌ఫ్లూపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌5ఎన్‌1 వేరియంట్‌ మహమ్మారిగా మారవచ్చని, ఇది కొవిడ్‌-19 కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని తెలిపారు. దీని కారణంగా ఆరోగ్య నిపుణుల ఆందోళన చెందుతున్నారు.

ఈ వ్యాధి సోకిన తొలి వ్యక్తి ఆవులతో సన్నిహితంగా ఉండటం వల్ల ఫ్లూ సోకినట్లు అధికారులు తెలపారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. మంగళవారం నాటికి ఫ్లూ అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లోని ఆవులలో గుర్తించారు. ఇందులో ఇడాహో, కాన్సాస్, మిచిగాన్, న్యూ మెక్సికో మరియు టెక్సాస్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu