HomeTelugu Trendingఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు

ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు

Bipasha basu and karan sing
బాలీవుడ్‌ జంట బిపాసా బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ తల్లిదండ్రులయ్యారు. బిపాసా శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. పాపకు దేవి బిపాసా సింగ్‌ గ్రోవర్‌గా నామకరణం చేసినట్లు ఈ జంట వెల్లడించింది. బిపాసా ఈ ఏడాది ఆగస్టులో తన ప్రెగ్నెన్సీని అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ.. తమ బిడ్డ కోసం ఎంతో ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 2016 ఏప్రిల్‌ 30న కుటుంబ సభ్యుల అనుమతితో వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన ఆరేళ్లకు ఇప్పుడు తొలిసారి బిపాసా బిడ్డకు జన్మనిచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu