బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్, నెపోటిజం వంటివాటితో వివాదలతో సతమతం అవుతున్న బాలీవుడ్ ను ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కూడా కుదిపేస్తోంది. పాట్నాలో దాఖలు చేసిన ఫిర్యాదులో సుశాంత్ తండ్రి రియా చక్రవర్తి ఆమె కుటుంబం సుశాంత్‌ను మోసం చేశారని అతని జీవితాన్ని అంతం చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో ఊహించని విధంగా డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో అతని ప్రియురాలు రియాను పోలీసులు విచారించారు. ఆతర్వాత ఈ కేసు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో( ఎన్సీబీ ) అధికారుల చేతికి వెళ్ళింది. ఎన్సీబీ అధికారులు రియాను విచారించి ఆధారాలు దొరకడం తో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించారు. రియా ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి బొంబాయి హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విచారణ రేపటికి ( సెప్టెంబర్ 29) కి వాయిదా పడింది. ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం మరికొందర్ని కూడా ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపధ్యంలో రియా చక్రవర్తి పై త్వరలో బయోపిక్ రానుంది. తాజాగా కొంతమంది దర్శకనిర్మాతలు రియా జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారట. రియా చక్రవర్తిపై ఒక డాక్యుమెంటరీ కూడా పైప్ లైన్ లో ఉందని తెలుస్తోంది. అంతేకాదు రియాపై ఓ పుస్తకాన్ని రెడీ చేస్తున్నారని వినికిడి. రియా జీవితంలో ఎదుర్కొన్న మంచి చెడును ఈ బయోపిక్ లో చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.