రాహుల్ సిప్లిగంజ్.. ‘బిగ్ బాస్’-3 టైటిల్ గెలవడంతోనే కాకుండా.. షోలో కంటిస్టెంట్ తో కొనసాగించిన ఫ్రెండ్షిప్ ద్వారా కూడా వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్ షోలో నటి పునర్ణవితో కొనసాగించిన లవ్ ట్రాక్ తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అవన్నీ వట్టివేనని తేల్చేశాడు. అయితే.. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అషూరెడ్డితో స్నేహం కొనసాగించాడు. అతి తక్కువ కాలంలోనే వీరి ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది.ఓ సారి రాహుల్.. అషూను ఎత్తుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కేవలం ఫ్రెండ్షిప్పేనా అని సందేహించారు నెటిజన్లు. అయితే.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చాడు రాహుల్. అషూ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు రాహుల్.
ఆమె తనపై చూపించే కేరింగ్ ఎంతో బాగుంటుందని తనకు అషూ వెరీ వెరీ స్పెషల్ అని తెలిపాడు. దీనికి ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. ఓ సారి తనకు డబ్బులు అవసరం కావడంతో.. వెంటనే అషూరెడ్డికి ఫోన్ చేసి అడిగాడట. తను కూడా వెంటనే పంపించిందట. ఈ విషయాన్ని కోట్ చేసిన రాహుల్.. తాను వేరే వాళ్లను ఇలా అడగలేనని అషూ దగ్గర మాత్రమే మొహమాటం లేకుండా అడగగలనని చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ చూసి అషూ ఎమోషనల్ అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ‘రాహుల్ నాకు ఏడుపొస్తోంది.. నువ్వు ఎప్పటికీ ఎంతో స్పెషల్’ అని రాసుకొచ్చింది.