తెలుగు బిగ్‌బాస్-4 విన్నర్ అభిజిత్‌కి బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. “ఎఫ్ 3” యూనిట్ నుంచి అభికి పిలుపందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే అభి ప్రముఖ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, వరుణ్ తేజ్‌ల సరసన నటించనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా అనిల్ రావిపూడి బిగ్‌బాస్ ఫైనల్లో హౌస్‌లోకి అడుగు పెట్టి సందడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడి టాప్ 5 కంటెస్టెంట్ల గురించి పూస గుచ్చి చెప్పిన అనిల్ అందరి మీదా పంచులు వేసి నవ్వించారు. ఎఫ్3లో ఛాన్స్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ఛాన్స్‌తో బిగ్‌బాస్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతానని చెప్పిన అభిజిత్ కల నెరవేరుతున్నట్లే కనిపిస్తోంది. కాగా ఇప్పటికే సోహైల్‌కు సినిమా అవకాశం రాగా అందులో నటించేందుకు చిరంజీవి, బ్రహ్మానందం సైతం రెడీగా ఉన్నారు.