తెలుగు బుల్లితెర బిగ్ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఈ 5 సీజన్‌లు పూర్తి చేస్తున్న ఈ షో.. తాజాగా ఆరో సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయానే అధికారికంగా తెలియజేస్తూ తాజాగా ప్రోమో విడుదల చేశారు. అప్పగింతలప్పుడు నవవధువు కంటతడి పెట్టుకోవడంతో ప్రోమో మొదలవుతుంది. మా ఇంటి మహాలక్ష్మిని పంపించడం నా వల్ల కావట్లేదమ్మా అంటూ తల్లిదండ్రులు ఎమోషనల్ అవ్వడం.. వారిని పెళ్లి కూతురు ఓదారుస్తున్న సమయంలో ఒక్కసారిగా అదృశ్యమవుతారు. వారు ఏమయ్యారోనని పెళ్లి కూతురు అన్వేషిస్తున్న సమయంలో నాగార్జున ఎంట్రీ ఇచ్చి.. ‘అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే..అక్కడ ఆట మొదలైనట్టే’ అని బిగ్‌బాస్ షో గురించి చెబుతాడు.
‘లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్‌బాస్ తర్వాతే’. బిగ్‌బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’ అంటూ నాగ్ చెప్పే సంభాషణలతో ఈ ప్రోమో ఎండ్ అవుతుంది. ఆరో సీజన్‌కి కూడా హోస్టింగ్ అక్కినేని నాగార్జున చేయబోతున్నాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎంపిక దాదాపు పూర్తి కావొచ్చిన్నట్లు తెలుస్తుంది. ఈ సారి ఎక్కువగా సినిమా రంగానికి చెందిన వారినే తీసుకురాబోతున్నారు అని టాక్. స్టార్ మాతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనూ ఈ షో స్ట్రీమింగ్ కానుంది.