Bigg Boss Telugu OTT season 2:
బిగ్ బాస్ 8 తెలుగు ఈ మధ్యనే ముగిసింది. ఈ సీజన్‌కి కొంత మిక్స్డ్ రెప్సాన్స్ వచ్చినా, చివరకు నిఖిల్ గెలిచాడు. ఫైనల్ తర్వాత కొద్ది రోజులు హడావిడి కనిపించినా, ఇప్పుడు ఆ హై పూర్తిగా తగ్గిపోయింది.
ఇప్పుడు కొత్తగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ మళ్ళీ వస్తుందని, ఈ సారి మార్చిలో సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేస్తారని టాక్. కానీ ఈ వార్తలో అసలు నిజం లేదు.
గతంలో కూడా, బిగ్ బాస్ 7 సీజన్ ఆలస్యమయినప్పుడు ఓటీటీ వెర్షన్ వస్తుందని వార్తలు వినిపించాయి. కానీ అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అసలు విషయం ఏమిటంటే, పహిలా ఓటీటీ సీజన్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అది అంచనాలకు తగ్గట్లుగా పాపులర్ కాలేదు. అందుకే మేకర్స్ డిజిటల్ వెర్షన్‌ను ఇకపై తీసుకురాబోమని నిర్ణయించారు. ఇక మీదట బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ చూసే అవకాశమే లేదు.
బిగ్ బాస్ ఫ్యాన్స్ మాత్రం నిరాశగా ఉన్నప్పటికీ, మొదటి ఓటీటీ ఫ్లాప్‌కి కారణంగా మేకర్స్ ఇంకోసారి అలాంటి ప్లాన్ చేయడం లేదు. అయితే, ఇప్పుడు అందరూ 9వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి అది ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.
ALSO READ: Game Changer తో పాటు మిగతా సంక్రాంతి సినిమాలు ఎన్ని కోట్లు సాధించాలంటే..!