HomeTelugu Big Storiesబిగ్‌బాస్ తెలుగు 35వ ఎపిసోడ్(ఆగస్ట్24) హైలైట్స్

బిగ్‌బాస్ తెలుగు 35వ ఎపిసోడ్(ఆగస్ట్24) హైలైట్స్

15 3

వీకెండ్‌ కావడంతో బిగ్‌బాస్‌లో ఈరోజు నాగార్జున సందడి చేశారు.. మన టీవీ ద్వారా.. ఇంటి సభ్యులను చూపించాడు.. ఇంటిలో కృష్ణాష్టమి సందర్భంగా బిగ్‌బాస్‌.. సభ్యులకి దుర్గ నెయ్యి ఇచ్చాడు. దానితో ఇంటి సభ్యులు క్యారెట్‌ హాల్వా తయారు చేశారు. దాన్ని నాగార్జున కూడా రుచి చూసి బాగుంది అన్నాడు. అనంతరం ఇంటి సభ్యులు సోఫాలో కూర్చున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి నాగార్జున క్లాస్‌ పీకాడు. ముందుగా బాబా మాస్టర్‌కి, తరువాత అలీకి క్లాస్‌ స్టార్‌ చేశాడు. ముందుగా తన టాస్క్‌ మీద మెచ్చుకున్న నాగ్‌ అనంతరం నీ యాటిట్యూడ్‌ బాలేదు, శివజ్యోతి కెప్టెన్‌ అయినా తన మాట వినలేదు.. నీకు అహంకారమా.. ఆడవాళ్లు అంటే చులకనా.. మాట్లాడుతుంటే.. దిక్కులు చూస్తున్నావ్‌.. పట్టించుకోవడం లేదు అని క్లాస్‌ పీకాడు. ఆ తరువాత కంటెస్టెంట్స్‌ అందరికీ ఓ టాస్క్‌ ఇచ్చాడు.. హౌస్‌లో మీకు ఎవరు మిత్రుడు, ఎవరు శత్రువు, ఎవరు
వెన్నుపోటు పొడిచారో చెప్పాలని అన్నాడు. ఈ క్రింది విధంగా కంటెస్టెంట్స్ తన మిత్రుడు, శత్రువు, వెన్నుపోటుదారుడిని సెలెక్ట్‌ చేశారు

పునర్నవి: రాహుల్‌ (మిత్రుడు), వరుణ్‌ (శత్రువు), వితిక (వెన్నుపోటు పొడిచినట్లు) తెలిపింది.
హిమజ: శ్రీముఖి (మిత్రుడు), వితికా (శత్రువు), అషూ (వెన్నుపొటు)
మహేష్‌: బాబా (మిత్రుడు), అలీ(శత్రువు), శ్రీముఖి(వెన్నుపోటు)

గేమ్ మధ్యలో ఈ వారం మహేష్‌ సేఫ్‌ అయినట్టు నాగార్జున ప్రకటించాడు.

వితికా: పునర్నవి(మిత్రుడు), హిమజ (శత్రువు), రవికృష్ణ (వెన్నుపోటు)
రాహుల్‌: పునర్నవి(మిత్రుడు), హిమజ(శత్రువు), రవి(వెన్నుపోటు)
అషూ: శివ జ్యోతి(మిత్రుడు), బాబా మాస్టర్‌(శత్రువు), హిమజ(వెన్నుపోటు)
శ్రీముఖి: రాహుల్‌ (మిత్రుడు), బాబా(శత్రువు), వితికా, పునర్నవి (వెన్నుపోటు)
వరుణ్‌: మహేష్‌(మిత్రుడు), వితికా(శత్రువు), పునర్నవి(వెన్నుపోటు)
శివజ్యోతి: అషూ(మిత్రుడు), మహేష్‌(శత్రువు) బాబా మాస్టర్‌(వెన్నుపోటు)
బాబా మాస్టర్‌: శ్రీముఖి(మిత్రుడు), అలీ, మహేష్‌(వెన్నుపొటు), శత్రువు లేరన్న బాబా
రవి: జ్యోతి(మిత్రుడు),అలీ( శత్రువు), వితిక(వెన్నుపోటు)
అలీ: శివజ్యోతి(మిత్రుడు), రవి(శత్రువు), హిమజ(వెన్నుపోటు)

ఈవారం సేఫ్‌ అయిన రెండో సభ్యుడిగా జ్యోతి సేవ్‌ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. ఈవారం ఎలిమినేషన్‌లో ఏడుగురు రాహుల్,హిమజ, అషు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్‌‌‌లు ఉండగా.. అందులో మహేష్, శివజ్యోతి సేఫ్ అయ్యారు. ఇద్దరు సభ్యులను సేవ్‌ చేసిన నాగర్జున ఈ రోజుకి సెలవు తీసుకున్నారు.. ఇక ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu