తెలుగు ‘బిగ్ బాస్-6’ నిన్నటితో ముగిసింది. ఆదివారం ‘బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే’ అట్టహాసంగా జరిగింది. ఈ సారి ‘బిగ్ బాస్’ విన్నర్‌కు గట్టి షాక్ ఇచ్చారు. ప్రైజ్ మనీలో విధించిన భారీకోతతో.. విజేతగా నిలిచినప్పటికీ.. విన్నర్ సింగర్ రేవంత్ కు నిరాశని మిగిల్చారు. ఇండియన్ ఐడల్ విజేతగా ఇప్పటికే తనను తాను ఫ్రూవ్ చేసుకున్న రేవంత్ .. బిగ్ బాస్ సీజన్ 6లో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే.
బిగ్‌బాస్ హౌస్ లోని తనదైనా స్టైయిల్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రేవంత్. దీంతో బిగ్‌బాస్ ట్రోఫి గెలుచుకొని విజేతగా నిలిచాడు. సీజన్ లో మొత్తం 21 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. చివరకు ఐదుగురు మాత్రమే నిలవటం.. వారిలో రేవంత్ విజేతగా నిలిచాడు. టైటిల్ పోరులో రేవంత్, శ్రీహాన్ నిలవగా.. వారిద్దరిని గోల్డెన్ బాక్స్ తో హౌస్ లోకి వెళ్లారు కింగ్ నాగార్జున. ఈ సందర్భంగా వారిద్దరికి అదిరే ఆఫర్ ఇచ్చారు. ప్రైజ్ మనీలో సగం తీసుకొని హౌస్ నుంచి వెళ్లిపోవచ్చని సూచన చేయగా.. ఇద్దరు ససేమిరా అన్నారు.
అయితే.. ఆ ప్రైజ్ మనీగా ఉన్నరూ.50 లక్షల్లో రూ.30 లక్షలు ఇస్తామని.. వాటిని తీసుకోవటానికి ఓకే చెప్పినోళ్లు వెళ్లిపోవచ్చన్నా.. ఇద్దరు నో అంటే నో అనేసి విజేతగా నిలిచే ప్రయత్నం చేశారు. అప్పుడే.. బిగ్ బాస్ అదిరే ఆఫర్ ను నాగ్ బయటపెట్టారు. ఫ్రైజ్ మనీలో రూ.40 లక్షలు తీసుకొని హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారని అడగ్గా.. శ్రీహాన్ ముందుకు రావటం.. అతగాడికి రూ.40లక్షల బాక్సు ఇచ్చేయటంతో అతగాడు రన్నరప్ గా బయటకు వెళ్లిపోయారు. దీంతో.. రేవంత్ విజేతగా నిలిచారు. కానీ.. అతగాడికి దక్కాల్సిన ప్రైజ్ మనీ రూ.50 లక్షలకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కామన్ మేన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచాడు .. టాప్ 4 స్థానంలో ఉన్నప్పుడు బయటికి వచ్చేశాడు. విజేతగా తాను నిలవకపోయినా, కావలసినంత గుర్తింపు మాత్రం తెచ్చుకున్నాడు.
ఇక.. హౌస్ నుంచి ఇంటికి వెళ్లిపోయిన వారికి అవార్డులు ఇస్తామంటే ఎవరికి ఇవ్వాలన్న మాటలకు ఫైనలిస్టులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెస్ట్ చెఫ్ అవార్డును మెరీనాకు.. బెస్ట్ స్లీపింగ్ స్టార్ అవార్డు శ్రీసత్యకు.. బెస్ట్ డ్యాన్సర్ అవార్డు ఫైమాకు.. బెస్ట్ గేమర్ అవార్డును రాజ్ కు.. బెస్ట్ లవ్వర్ అవార్డు అర్జున్ కల్యాణ్ కు ఇచ్చారు.