తెలుగు బిగ్‌బాస్ సీజన్-4కు హోస్ట్ హోస్ట్ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ నిమిత్తం నాగార్జున థాయ్‌లాండ్ వెళ్లి ఇంకా తిరిగి రాలేదని. షెడ్యూల్ ప్రకారం మరికొన్ని వారాలపాటు అక్కడే షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని. దీంతో నాగార్జునను డిస్టర్బ్ చేయకుండా కొన్ని ఎపిసోడ్స్‌లో ఆయనకు బదులు వేరొకరిని తీసుకోవాలని బిగ్‌బాస్ యాజమాన్యం ప్లాన్ చేసిందని వార్తలు వచ్చాయి.
అయితే రమ్యకృష్ణ వద్దకు ఆ ఆఫర్ వెళ్లిందని. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ యాజమాన్యం తీసుకొచ్చిన ప్రతిపాదనపై ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకొచ్చారు. ఈ వారం నుంచే బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు అన్నీంటికి బిగ్‌బాస్ చెక్ పెట్టాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రొమోలో నాగ్ హోస్ట్ చేస్తూ కనిపించారు. అభిజిత్, అఖిల్‌కు మొనాల్ విషయంలో క్లాస్ పీకాడు. సోహైల్ నీ వాయిస్ కంట్రోల్ చేసుకో.. ఇంకోసారి హౌస్‌లో ఆడపిల్లల మీద అరిస్తే అంటూ కొరడ చూపించి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.
Weekend Kick ki King ready…Miru ready ye kada..It’s going to be fun!!!#BiggBossTelugu4 today at 9 PM on @StarMaa pic.twitter.com/vgxnvh9cHu
— starmaa (@StarMaa) October 10, 2020