Bigg Boss Sohel Interview
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో విన్నర్ అయిన అభిజిత్ కంటే సయ్యద్ సోహెల్ కి ఎక్కువ పాపులరిటీ వచ్చింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఫైనల్స్ దాకా ఉన్న సోహెల్ ఫినాలే లో కొంత డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాక టీవీ షో లతోపాటు ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నాడు.
హీరోగా కూడా మారి పలు సినిమాల్లో నటించి కెరియర్ లో బాగానే ముందుకు వెళ్లాడు. సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ సోహెల్ కి అనుకున్నంత పేరు మాత్రం రాదు. మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత బూట్ కట్ బాలరాజు అనే సినిమాలో నటించాడు సోహెల్.
అయితే రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. అందులో బూట్ కట్ బాలరాజు సినిమా సమయంలో ఎమోషనల్ అయిన సోహెల్ కన్నీళ్లు పెట్టుకుంటూ సినిమా చూడమని ప్రాధేయపడ్డాడు. అయినా కూడా జనం పెద్దగా పట్టించుకోలేదు.
తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను అలా చేసి ఉండకూడదు అంటూ తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు సొహెల్. దీంతో లేటుగా అయినా సోహెల్ కి జ్ఞానోదయం అయినందుకు ఫాన్స్ సంతోషించారు. తమిళ్లో బిగ్బాస్ ఫేమ్ కవిన్ మంచి సినిమాలు చేస్తూ స్టార్ డం సంపాదించాడు అని మాట్లాడుతూ.. మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అన్నాడు సోహెల్.
తను కూడా మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు అడక్కుండానే థియేటర్లకు వస్తారు.. అని సోహెల్ కి అర్థం అయింది అని ఫాన్స్ చెబుతున్నారు. సినిమా విడుదల సమయంలో తను అలా ఏడుస్తూ సినిమా చూడమని ప్రాధేయపడటం తప్పని తెలుసుకున్నట్టు చెప్పుకొచ్చాడు సోహెల్. ప్రస్తుతం సోహెల్ చేతిలో రెండు మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. చర్చల దశలో ఉన్న ఈ సినిమాలు పూర్తయి విడుదలయితే ఎంతవరకు సోహెల్ కెరీర్ కి ఉపయోగపడతాయో చూడాలి.