తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ త్వరలో సీజన్-4 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ షో లాక్డౌన్ కారణంగా ఈ సంవత్సరం కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. అక్టోబర్‌లో బిగ్‌బాస్-4 సీజన్ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి నుంచే ఈ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రెండు మూడు సీజన్స్‌తో పోలిస్తే.. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. సీజన్-2కు నాని, సీజన్-3కు నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇపుడు సీజన్-4 కోసం ‘స్టార్ మా’ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సారి మరింత భారీగానే బిగ్‌బాస్-4 ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. అందులో భాగంగానే ఇప్పట్నుంచే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరుగుతుంది. తాజాగా బిగ్‌బాస్-4 లో ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి కూడా పాల్గోనున్నట్లు సమాచారం. బిత్తిరి సత్తి
టీవీ 9 యాజమాన్యంతో ఓ ప్రోగ్రామ్ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా బయటకు వచ్చాడు. మాస్లో ఫాలోయింగ్ ఉన్న బిత్తిరి సత్తిని స్టార్ మా సంప్రదించి బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గోనే అవకాశమిచ్చినట్టు సమాచారం.
ఇప్పటికే బిగ్‌బాస్ నిర్వాహకులు మొదటి మూడు సీజన్ల కోసం బిత్తిరి సత్తిని సంప్రదించగా.. అప్పట్లో బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. సీజన్-4 కోసం కూడా అడిగారట. మొన్నటి వరకు టీవీ9లో చేస్తుండటంతో ఒప్పుకోలేక పోయినా ఇప్పుడు ఆ సంస్థ నుంచి బయటకు రావడంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్‌బాస్ ఆఫర్ రావడం.. దానికి బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లోకి బిత్తిరి సత్తితో పాటు మరో నలుగురు కంటెస్టెంట్స్ ఇప్పటికే ఫైనలైజ్ అయినట్లు తెలుస్తుంది. అందులో ఒకరు ఒకప్పటి లవర్ బాయ్ హీరో.. తరుణ్, సింగర్ మంగ్లీ, హాట్ యాంకర్ వర్షిణి, సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్ ఈ లిస్ట్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.