HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌.. విన్నర్‌ బిందు మాధవి పెళ్లిపై తండ్రి కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. విన్నర్‌ బిందు మాధవి పెళ్లిపై తండ్రి కామెంట్స్‌

Bigg boss non stop winner b

‘బిగ్‌బాస్‌’ నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. చివరి వరకు అఖిల్‌ గట్టి పోటీ ఇచ్చినా.. బిందు విజేతగా నిలిచి ట్రోపీతో పాటు రూ.40 లక్షలు దక్కించుకుంది. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ట్రోపీ అందుకున్న తొలి మహిళగా బిందు మాధవి నిలిచింది. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు.. బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ఆమెకు వచ్చింది. ప్రస్తుతం బిందు వరుస ఇంటర్వ్యలతో ఫుల్‌ బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు బిందు మాధవి పెళ్లిపై సోషల్‌ మీడియలో చర్చ జరుగుతోంది. త్వరలోనే బిందు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిందు పెళ్లిపై ఆమె తండ్రి స్పందించారు. పెళ్లి గురించి తాము ఆలోచించడం లేదని, ఆమెకు ఇష్టం ఉన్నప్పుడే చేస్తామని చెప్పుకొచ్చాడు.

‘బిందు ఇంజనీరింగ్‌ చదివేటప్పుడే పెళ్లి గురించి చాలా ఒత్తిడి చేశా. అప్పుడు చాలా మంచి సంబంధాలు వచ్చాయి. ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, డాక్టర్‌, అమెరికా ఇంజనీరింగ్‌ సంబంధాలు వచ్చాయి. అప్పుడు ఒక తండ్రిగా నేను ఇంతమంచి సంబంధాలు వస్తున్నాయి.. పెళ్లి చేసుకో అని బిందుపై ఒత్తిడి తెచ్చాను. నేను కూడా చాలా బాధపడ్డాను. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సంబంధాలు చూశాను. కానీ ఒప్పుకోలేదు.

‘నేనే చూసుకుంటాను నాన్న.. నేనేం చిన్నపిల్లను కాదు కదా? నా మంచి చెడుల గురించి నాకు తెలుసు. నేను చెప్పినప్పుడు నా పెళ్లి చేయండి ‘అని బిందు చెప్పింది. అప్పటి నుంచి ఆమె ఆకాంక్షలకు, అభిలాషకు నేను పూర్తిగా వదిలేశాను. కాలాలు మారాయి. పిల్లల ఆకాంక్షలకు, అభిలాషలకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి తల్లికి, తండ్రికి ఉంది’ అని
బిందు మాధవి తండ్రి అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!