బిగ్‌బాస్-4 లో నిన్నటి ఎపిసోడ్‌లో కొంతమంది ఇంటి సభ్యుల తల్లులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్‌లో మిగిలినవారి పేరెంట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో సోహైల్ తండ్రి, లాస్య తన కొడుకు జున్ను, భర్త వచ్చారు. అరియానా తనకోసం వచ్చిన వినయ్‌కు ఐ లవ్ యూ చెప్పింది. చివరిగా మోనాల్ వంతు వచ్చేసరికి మాత్రం బిగ్‌బాస్ ఆమెను మరోసారి ఏడిపించాడు. కేవలం ఆమె తల్లి వాయిస్ మాత్రమే వినిపించాడు. మోనాల్ బెటా.. ఎలా ఉన్నావు? నేను హైదరాబాద్‌కు రాలేకపోయాను అన్న తల్లి మాటలను విని ఆమె గుండెలవిసేలా రోదించింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చింది. ఆమె బాధ చూసి మిగతావారి కళ్లు చెమర్చాయి. ఈ తరువాత బిగ్‌బాస్ ఆమె చెల్లెలిని లోపలకు పంపించిన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతోందో.