బిగ్ బాస్ ఫినాలేకి ముందు ఆఖరి ఆదివారంలో నేచురల్ స్టార్ నాని సూపర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 105 ఎపిసోడ్ ప్రారంభంలో గణపతి నిమజ్జనం సందర్భంగా.. నాని నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని గణపతి పప్పా సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులేసి లేశారు. హోస్ట్ నాని. అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే..
నేచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జున నటించిన మల్టీస్టారర్ ‘దేవదాస్’ ఈనెల 27న ప్రేక్షకుల ముందుకి వస్తున్న సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదికి గన్‌తో వచ్చేశాడు నాగార్జున. వచ్చీ రావడంతో తోటే ‘నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో బాగా ఇబ్బంది పెడుతున్నారంట ఎవరు దాస్ అని అడగడంతో ఒక్కరూ కాదు దేవా అందరూ అంటూ కంటెస్టెంట్స్ ఆరుగురిని పరిచయం చేశారు నాని. మీ అందరిలో ఎవరో మా దాస్‌ని ఇబ్బంది పెడుతున్నారట. ఈ గన్‌లో కరెక్ట్‌గా ఆరు బుల్లెట్స్ ఉన్నాయ్ దించేస్తా జాగ్రత్త’ నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎన్నాళ్ల నుండి ఉంటున్నారు ఇక్కడ అని కంటెస్టెంట్స్‌ని అడిగితే.. 106 రోజులు నుండి అని సమాధానం ఇవ్వడంతో ‘ఏమైనా పోయేకాలం వచ్చిందా మీకు’ అని అనడం.. దేవదాస్ ట్రైలర్‌లో పెగ్గుల మీద పెగ్గులు లాగించేశారని కౌశల్ అంటే.. మీకు బిగ్ బాస్ హౌస్‌లో పెగ్‌లు ఇవ్వడం లేదా? అది మీ ఖర్మ అంటూ పంచ్ పేల్చారు.
మీ సినిమా హీరోయిన్స్ చాలా బాగున్నారు సార్.. అని కౌశల్ అంటే.. ఏమన్నావ్ అంటూ గన్ పట్టుకుని సీరియస్‌గా కౌశల్ వైపు నడుచుకుంటూ వెళ్లడం ఫన్‌ని సరదగా అనిపించింది. ఇక నేనైతే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండే వాడిని కాదు.. నాతో పాటు మిగిలిన ఐదుగురు ఆడవాళ్లు ఉండి ఉంటే ఉండేవాడినేమో. కాని మొగాళ్లతో నాకు కష్టం అన్నారు. ఇక నానిని ఉద్దేశించి ఏంటి బిగ్ బాస్ స్టేజ్ మీద కలర్ లేదా? అనడంతో నాకసలు ఇక్కడ కలర్ లేదు దేవా.. అనడం, ఉండు నేను కలర్ పంపుతా అని హీరోయిన్స్‌ని బిగ్ బాస్ స్టేజ్ పంపించారు నాగార్జున. ఇక ‘దేవదాస్’ మూవీ ట్రైలర్‌ను మనవాళ్లకు చూపించండి అంటూ కంటెస్టెంట్స్‌తో కలిసి ట్రైలర్‌ను ఎంజాయ్ చేశారు దేవా. మొత్తానికి నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్న కాసేపూ ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఇక నాగార్జున వెళ్లిన తరువాత ‘దేవదాస్’ హీరోయిన్స్.. ఆకాంక్ష సింగ్, రష్మికా మందానాలు బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు.
బిగ్ బాస్‌లో ఒకే ఒక్క వారం మిగిలి ఉండంటంతో బిగ్ బాస్ హౌస్ నుండి క్యాంపెయిన్ మొదలు పెట్టాల్సిందిగా కంటెస్టెంట్స్‌ను కోరారు నాని. మీకు ప్రేక్షకులు ఎందుకు ఓటు వెయ్యాలి? మిగిలిన కంటెస్టెంట్స్ కంటే మీరు ఎందుకు బెస్ట్ అనే విషయాన్ని చెప్పాలంటూ.. మొదటిగా కౌశల్‌తో ప్రారంభించారు.
తన క్యాంపెయిన్‌ను కథతో వివరించారు కౌశల్. కథ ఏంటంటే.. ‘అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి ఓ రాజు. కాని ఆ రాజ్యానికి వారసుడు మాత్రం ఉండడు. దీనిపై ఆలోచించిన రాజు నక్షత్రం అనే జట్టుని ఏర్పాటు చేసి.. రాజ్యం మొత్తం తిరిగి కండ బలం, గుండె బలం, బుద్ధిబలం ఉన్న 16 మంది వీరుల్ని వెతికిపట్టి తీసుకురావాలంటారు. రాజు ఆదేశాల మేరకు ఆ జట్టు 16 మందిని వెతికిపట్టి తీసుకువచ్చి రాజు ముందు ప్రవేశ పెడతారు. ఆ వీరుల ముందు ఓ పులి బోనులో ఉంచి ఆ పులి బయటకు విడిచిపెట్టిన తరువాత ఎవరైతే దాన్ని బంధించి పట్టుకుంటారో.. వాళ్లని ఈ రాజ్యానికి రాజుని చేయడం మాత్రమే కాకుండా, నా కూతుర్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తానంటారు. అందులో ఒక్కడు తప్ప మిగిలిన 15 మంది జట్టుగా ఏర్పడి ఆ పులిని పట్టుకోవాలనుకుంటారు. కాని మిగిలిన ఒక్కడికి ఆ పులి.. ఆ పులి కన్నుతప్ప ఇంకేమీ కనిపించవు. తన కసి పట్టుదలతో పులిని వేటాడి వేటాడి పట్టుకోవాలని కసితో పోరాడుతాడు.
ఇది గమనించిన మిగిలిన వేటగాళ్లు మనం వేటాడాల్సింది పులిని కాదు.. ఆ పులిని వేటాడుతున్న ఆ ఒక్క వేటగాడ్ని అంటూ ఆ వేటగాడిపై వరుస బాణాలు వదులుతారు. ఆ బాణాలు తగిలిఒరిగిపోతాడు. రక్తం కారుతున్నా.. తన వేటను ఆపేయడు. ఈ పోరాటాన్నంతా జనం చూస్తూ ఉంటారు. ఆ జనం మధ్యలో ఉన్న లల్లీ అనే రెండేళ్ల పాప లే.. నువ్ పోరాడు అంటూ ప్రోత్సహిస్తుంది. ఆమెతో పాటు జనం కూడా లేచి పోరాడాలని ప్రోత్సహిస్తారు. జనం స్పందన చూశాక మిగిలిన వేటగాళ్లు కూడా లే అంటూ కేకలు వేస్తారు. ఆ శబ్ధం ఆ వేటగాడిలో చలనం ఇస్తుంది. గుండెల్లో గుచ్చుకున్న బాణాలను తీసి పులిని పట్టుకుంటాడు. చివరికి ఆ పులి అతడికి లొంగిపోతుంది. రాజు ఆ వేటగాడికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేస్తారంటూ ఈ కథలో ఆ వేటగాడ్ని తానే అని మిగిలిన జట్టు సభ్యులు మిగిలిన కంటెస్టెంట్స్ అంటూ ఎప్పటిలాగే రోల్ రైడా, దీప్తి, తనీష్, సామ్రాట్, గీతా మాధురిలపై విమర్శలు గుప్పించారు కౌశల్.
క్యాంపెయిన్‌లో భాగంగా సామ్రాట్, గీతా, దీప్తి, సామ్రాట్, రోల్ రైడాలు సేఫ్ గేమ్ ఆడారు. తాము ఇప్పటి వరకూ వచ్చామంటే అందరూ గ్రేట్ అని.. ఇందులో ఒక్కరికి కూడా బిగ్ బాస్ టైటిల్ కొట్టే అర్హత లేదని చెప్పేందుకు వీలు లేదంటూ ఎమోషనల్ స్పీచ్‌లతో ఆకట్టుకున్నారు. ఇక చివరి కీలకమైన ఎలిమినేషన్స్‌లో మొదటిగా టాప్ ఫైనల్ కంటెస్టెంట్స్‌ను ఒక్కరిగా రివీల్ చేశారు నాని. సామ్రాట్ ఇప్పటికే తొలి ఫినాలే కంటెస్టెంట్ కావడంతో కౌశల్‌ను రెండవ ఫినాలే కంటెస్టెంట్‌గా ప్రకటించారు. తరువాతి వరుసగా.. నెంబర్ 3 కంటెస్టెంట్‌గా గీతా మాధురి.. నెంబర్ కంటెస్టెంట్‌గా తనీష్.. నెంబర్ ఫినాలే కంటెస్టెంట్‌గా దీప్తి నల్లమోతులను ప్రకటించడంతో మిగిలిన రోల్ రైడాను బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక 1. సామ్రాట్ ,2. కౌశల్ ,3. గీతా మాధురి ,4. తనీష్ ,5. దీప్తి నల్లమోతు సభ్యులు మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ఇక ఇది చివరి వారం కావడంతో బిగ్ బాంబ్‌ను మినహాయింపు ఇస్తూ.. బిగ్ బాంబ్ లేదన్నారు నాని. చివరివారం అంతా హ్యాపీగా ఉంటారని బిగ్ బాంబ్ ఇవ్వడం లేదన్నారు. నీ అంచనా ప్రకారం బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశం ఎవరికి ఉందని.. టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అని నాని అడగడంతో.. టాప్ 3లో కౌశల్ పక్కాగా ఉంటాడని.. ఆ తరువాతి స్థానంలో గీతా మాధురి, తనీష్‌లు ఉంటారన్నాడు రోల్ రైడా.
My campaign for @kaushalmanda begins from here…do vote for him..show some bloody respect for the champion by voting him 😀 #kaushalarmy #biggbosstelugu2 #Vote4Kaushal pic.twitter.com/j7bK6pJCA8
— Naveen Nayak (@LensNayak) September 23, 2018
People from many places throughout the world have been supporting Kaushal.Then why wouldn't his kids support him? So, here's Littu & Lalli supporting his papa.This week is the most crucial. If there is one way to show our love to Kaushal, it's through voting. Please keep voting. pic.twitter.com/54FN0NEFzF
— kaushal manda (@kaushalmanda) September 23, 2018