ఈ రోజు గ్రాండ్ ఫినాలే సందర్భంగా బిగ్‌బాస్‌లో సందడి నెలకొంది. అయితే స్టేజ్ పై ఎలిమినేట్ అయిన సభ్యులందరు స్టెప్స్ వేశారు. ముందుగా రవి, జ్యోతి జంట కట్టారు. ఇక రెండో జంటగా.. హిమజ, శిల్పా చక్రవర్తి, మరో జంటగా.. పునర్నవి. వితిక, జాఫర్, తమన్న ఒక జంట, హేమ మాత్రం సింగిల్‌గానే డాన్స్ చేసింది. చివరి రోజు కావడంతో నాగార్జున స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. తరువాత కంటెస్టెంట్స్ తో ఎవరు విన్నర్.., బయటికి వెళ్లిన తరువాత తమ లైఫ్ ఎలా ఉంది అని ఎలిమినేట్ అయిన సభ్యులను నాగ్ ప్రశ్నించాడు. అయితే హిమజ ప్రస్తుతం సినిమా చేస్తున్నట్లు.. ఇది బిగ్‌బాస్‌లో దెయ్యాల టాస్క్ చేయడం వల్ల వచ్చిన అవకాశం అనుకుంటున్నానని చెప్పంది. పునర్నవి అయితే బిగ్‌బాస్ తన లైఫ్‌ను ఛేంజ్ చేసిందని తెలిపింది. ఇక జాఫర్.. బాబా విన్నర్ అని చెప్పగా.. తమన్నా లేడీ టైగర్ శ్రీముఖి విన్నర్ అని చెప్పింది. మిగతా వారు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఈ వేడుకకు హజరైన టాస్ 5 కంటెస్టెంట్స్.. ఇంటి సభ్యులతో తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు నాగ్. ముందుగా అలీ ఇంటి సభ్యులతో మాట్లాడారు. అలీ తండ్రి చాలా గర్వంగా ఉంది అని అన్నారు.
వరుణ్ తండ్రి అమెరికా నుంచి వచ్చారు.. తన అభిప్రాయాలను చెబుతూ.. మాటల్లో చెప్పలేని పాట పాడుతా అంటూ.. ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా.. అనే సాంగ్‌తో తన అభిప్రాయాన్ని చెప్పారు. వరుణ్ బామ్మ నాగ్ని పొగడ్తలతో ముంచెత్తింది. నా మనవడు వరుణ్ని కలవడం కంటే మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. గీతాంజలిలో ఏ..ఏ.. అనే డైలాగ్ ఇష్టమని తెలిపారు. మన సినిమాలో శ్రియతో ఇలా ఇవ్వు(ఐ లవ్ యూ) అనే డైలాగ్ చాలా ఇష్టమని బామ్మగారు చెప్పారు.
ఇక రాహుల్.. తల్లితండ్రులు తమ అబ్బాయే విన్నర్ అని చెప్పారు. బాబా మాస్టర్.. కొడుకు, కూతురు, వైఫ్ కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు. బాబామాస్టర్ ఇక్కడ వరకు రావడమే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తర్వాత హౌస్‌లోకి వెళ్లిన నాగ్.. విన్నర్ ఎవరు అనే అంశాన్నిఇంటిలోని సభ్యులను అడిగారు. ఎవరు విన్నర్ అయినా.. అందరూ విన్నర్లాగా ఫీలవుతామని బాబా మాస్టర్ చెప్పారు. దానికి నాగ్ ఓటింగ్ అయిపోయింది. కాసేపట్లో.. విన్నర్ ఎవరో మేము ప్రకటించేస్తాము అన్నారు.. వరుణ్ కూడా కూల్ అని సమాధానం ఇచ్చాడు. రాహుల్ టాప్ 5 మీద తనదైన శైలిలో పాట పాడాడు.