HomeTelugu Newsసురేఖవాణి కూతురితో బిగ్‌బాస్‌ నటుడు.. ఆ రేంజే వేరు!

సురేఖవాణి కూతురితో బిగ్‌బాస్‌ నటుడు.. ఆ రేంజే వేరు!

Surekha Vani maintain heroi
బిగ్‌బాస్ షో మంచి గుర్తింపు తెచుకున్న నటుడు అమర్ దీప్‌. అంతకుముందే ఓ సీరియల్‌లో నటించిన అమర్‌ దీప్‌కు అంత గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్‌ ఇచ్చిన ఈమేజ్‌తో మంచి జోషల్‌లో ఉన్న ఈ నటుడు ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

బిగ్ బాస్ షోకి వెళ్లక ముందే ఈ సినిమాకు సైన్ చేసి వెళ్లానని.. పూజా కార్యక్రమంల్లో అమర్ దీప్ వెల్లడించాడు. ఇక ఈ సినిమాతో నటి సురేఖా వాణి కూతురు సుప్రిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఈ ఇద్దరూ తొలిసారిగా ఇలా తెరపై కనిపించబోతోన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభించారు.

హీరోయిన్ల మదర్స్ ఎక్కువగా సెట్స్ మీద హడావిడి చేస్తుంటారు. ఇక ఇన్ని రోజులు సెట్స్ మీద నటిగా కనిపించిన సురేఖా వాణి.. ఇప్పుడు హీరోయిన్ మదర్ రేంజ్‌ను మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంది. అమర్ దీప్, సుప్రితల మీద కొన్ని సీన్లను మొదటి రోజు చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సీన్లను సురేఖా వాణి దగ్గరుండి పర్యవేక్షించినట్టుగా ఉంది. ఆ సీన్లను సురేఖా వాణి గమనిస్తున్నట్టుగా ఉంది.

సెట్స్‌లో సురేఖా వాణి సందడి మామూలుగా లేదని తెలుస్తోంది. ఈ మూవీతో సుప్రిత సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. తన కూతురిని హీరోయిన్‌గా తెర మీదకు తీసుకు రావాలని చాలా రోజుల నుంచి సురేఖా వాణి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సురేఖా వాణి కోరిక అయితే తీరనుంది.

సుప్రితకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. ఆమె అందాల ప్రదర్శనకు ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. తల్లితో ఆమె చేసే రీల్స్‌ సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అవుతూ ఉంటాయి. మరి ఆమె అందాలు ఈ సినిమాకి ఎంత వరకూ ప్లస్‌ అవుతాయి. సోషల్‌ మీడియాలోనే రెచ్చిపోయిన సుప్రీయ ఈ సినిమాలో ఎలా నటిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీతో సుప్రిత, అమర్ దీప్‌ల కెరీర్ కు ప్లస్‌ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!