బిగ్‌బాస్-4 లో తొమ్మిదో వారం ఎలిమినేషన్ జరిగింది. సోషల్ మీడియాలో ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఈవారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. దీపావళి సందర్భంగా ఇంటిసభ్యులకు బహుమతులు వచ్చాయి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని స్టేజ్‌పైకి వచ్చిన సుమ అదంతా ప్రాంక్ అని కొన్ని క్షణాల్లోనే తేలిపోయింది. సుమ కంటెస్టెంట్లతో సహా నాగార్జున మీద కూడా పంచులు విసిరింది. ఇక హౌస్‌లోకి గంగవ్వ వయసొచ్చాక వెళ్తానంటూ షో నుంచి జారుకుంది. నామినేషన్స్‌లో చివరికి మాస్టర్, అవినాష్ డేంజర్ జోన్‌లో ఉండిపోయారు. పొరపాటున అవినాష్ వెళ్లిపోతాడేమోనని అరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఏం జరిగినా నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని ప్రామిస్ వేయించుకుంది. ‘నీ కాళ్లు పట్టుకుంటా, నాకోసం ఎదురు చూడు, నువ్వు బతికుంటే చాలు’ అంటూ ఎమోషనల్ అయింది.
నాగార్జున ఇంతలోనే డబుల్ ఎలిమినేషన్ ఉందని షాక్ ఇచ్చాడు. కానీ అవినాష్ సేఫ్ అయ్యాడు. గుండాగినంత పనైంది అని భోరున ఏడ్చాడు. అవినాష్ “మళ్లీ జీరోకు వచ్చాను, బిగ్‌బాస్ వల్లే నాకు మళ్లీ లైఫ్ వచ్చింది” అని చెప్పుకొచ్చాడు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవగా అతనితో గేమ్ ఆడించాడు. అందులో భాగంగా సోహైల్, లాస్య, అరియానా, మోనాల్, మెహబూబ్, అవినాష్.. అసలు అని, అఖిల్‌ను హీరో అంటూ, అభిజిత్‌ను విలన్ అంటూ ఈ ఇద్దరూ నకిలీ మనుషులు అని తేల్చి చెప్పాడు. హారికను కూడా ఈ నకిలీ జాబితాలోనే చేర్చాడు. తన కెప్టెన్సీని మెహబూబ్‌కు ఇచ్చేశాడు. అయితే ఇమ్యూనిటీ మాత్రం లభించిందని నాగ్ స్పష్టం చేశారు. ఇక ఈ వారం బిగ్‌బాంబ్ లేకపోవడం ఇంటిసభ్యులు ఊపిరి పిల్చుకున్నారు.