
Bigg Boss 8 Telugu Wildcard:
బిగ్ బాస్ 8 తెలుగు షో ఈసారి మరింత ఉత్కంఠగా సాగుతోంది. ఇంట్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ల మధ్య ఉన్న సంబంధాలు ఇప్పుడు మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారాయి. వారం మధ్యలో ఎలిమినేషన్ ద్వారా నైనిక లేదా ఆదిత్య ను ఇంటి నుంచి బయటకు పంపబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిన్నటి ఎపిసోడ్లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి.. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు.
ఇకపోతే, ఈ వారంలో ప్రేక్షకులకి మరింత ఆసక్తి రేకెత్తించే విషయమైతే, ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడం. ఈ ఎంట్రీలు షోలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి అని మేకర్స్ ఆశిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా షోలో అడుగుపెట్టబోయే వారు– నటి హరి తేజ, కమెడియన్లు టేస్టీ తేజ, ముక్కు అవినాష్, హీరో గౌతమ్ కృష్ణ, యూట్యూబర్ గంగవ్వ.
వీరిలో మెహబూబ్ దిల్ సే, ప్రముఖ కమెడియన్ రోహిణి కూడా ఉన్నారు. వీళ్ళు వచ్చాక షోలో పూర్తిగా వాతావరణం మారిపోనుంది. ముఖ్యంగా ఇంతటి పెద్ద సంఖ్యలో ఎంట్రీలు రావడం ద్వారా, గేమ్ మరింత కఠినతరంగా మారుతుందని అంచనా వేయచ్చు. మరి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కొత్త ఎంట్రీలకు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
అంతేకాకుండా వారాంతం కూడా రాకుండానే మధ్యలోనే.. ఇంట్లో నుంచి హీరో ఆదిత్య ఓం వెళ్లిపోయారు. ఇప్పటికే ఐదుగురు షోకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోగా.. ఇంట్లో హౌస్ మేట్స్ కూడా తగ్గారు. కానీ ఇప్పుడు ఒకేసారి ఇంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీలతో.. మళ్లీ బిగ్ బాస్ ఇల్లు కళకళలాడడానికి రెడీ గా ఉంది.
Read More: Pawan Kalyan అసలు పేరు ఇదేనా? తెలియని నిజాలు బయటపెట్టిన జనసేనాని తల్లి