HomeTelugu TrendingBigg Boss 8 Telugu నబీల్ ప్రవర్తనపై ప్రేక్షకులు తీవ్ర అసహనం!

Bigg Boss 8 Telugu నబీల్ ప్రవర్తనపై ప్రేక్షకులు తీవ్ర అసహనం!

Bigg Boss 8 Telugu: Nabeel’s Over-Aggression Sparks Backlash!
Bigg Boss 8 Telugu: Nabeel’s Over-Aggression Sparks Backlash!

Bigg Boss 8 Telugu Nomonations:

బిగ్ బాస్ 8 తాజా ఎపిసోడ్‌లో నామినేషన్స్ సెగ్మెంట్ రొటీన్‌గా మిగిలిపోయింది. యశ్మి ఎలిమినేషన్ తర్వాత పృథ్వి, విష్ణు ప్రియా, ప్రేరణ, నిఖిల్, నబీల్ వంటి పాత కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. అయితే, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంట్లోకి రావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కానీ నామినేషన్స్ ఎపిసోడ్‌లో మాత్రం వినోదం కనిపించలేదు.

గౌతమ్, నబీల్ ఇద్దరూ తమ ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమయ్యారు. గౌతమ్ ప్రధానంగా “గ్రూప్ గేమ్” అంశాన్ని అందరికీ వ్యతిరేకంగా తెరపైకి తెస్తూ, పృథ్వి ప్రేరణను నామినేట్ చేశాడు. అతను నామినేషన్ సమయంలో నబీల్, నిఖిల్‌తో వాదనలకు దిగుతూ, ఒకే కారణం పై పదేపదే మాటల యుద్ధం చేశాడు కానీ ఆకట్టుకోలేదు.

 

View this post on Instagram

 

A post shared by Nabeel Afridi (@iamnabeelafridi)

గతంలో కూడా యశ్మి బయటకు వెళ్తూ అతడిని నేరుగా “బిగ్ బాంబ్” రూపంలో నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నబీల్ విషయానికి వస్తే, అతడి ఓవర్ అగ్రెసివ్ ప్రవర్తన లిమిట్ దాటుతోంది. ముఖ్యంగా గౌతమ్, రోహిణి వంటి కంటెస్టెంట్లతో వాదనల్లో అతడి మాటలు హద్దులు దాటాయి అని చెప్పచ్చు.

నామినేషన్ సమయంలో నబీల్ అహంకారపూరిత ప్రవర్తన, ఇతరుల మాటలను వినకపోవడం, దూకుడుగా ఉండడం అతనికి ప్రతికూలంగా మారే అవకాశముంది. ఈ ఎపిసోడ్‌లోనూ అతడు ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, పదే పదే వాదనలతో సమయం వృథా చేశాడు.

ప్రస్తుతం షో కీలక దశలో ఉంది. పాత కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీల మధ్య సమానమైన అవకాశాలు ఉన్నాయి. నిఖిల్, గౌతమ్ టైటిల్ రేసులో ముందంజలో ఉన్నారు. రోహిణి టాప్ 5లోకి ప్రవేశించే అవకాశం ఉంది. మహిళా కంటెస్టెంట్లలో ప్రేరణ కూడా పోటీలో బలమైన హౌస్ మేట్ గా కనిపిస్తోంది. విష్ణు ప్రియ, పృథ్వి, తేజ, అవినాష్, నబీల్ వంటి వారిలో కొందరు త్వరలో ఎలిమినేట్ అవుతారనేది స్పష్టంగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Chay-Sobhita పెళ్లికి హాజరవుతున్న సెలబ్రిటీల జాబితా ఇదే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu