Bigg Boss 8 Telugu Nabeel Afridi:
బిగ్ బాస్ తెలుగు 8 మొదలైనప్పుడు, నబీల్ అఫ్రిదీ అంతలా ఎంటర్టైన్ చేస్తూ.. స్ట్రాంగ్ గా మారతాడు అని చాలా మంది ఊహించలేదు కావచ్చు. కానీ కొద్ది వారాల్లోనే, అతని అభిమానుల సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో ఇతర కాంటెస్టెంట్స్ కంటే నబీల్ పెద్దగా ఫేమస్ కాకపోయినా.. అతని స్ట్రాటజిక్ గేమ్ ప్లే అందరి దృష్టిని ఆకర్షించింది.
బిగ్ బాస్‌కు ముందే నబీల్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ డైరీస్ ద్వారా బాగానే పాపులర్ అయ్యాడు. తనకి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 16.2 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 5.88 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, బిగ్ బాస్ అతనికి ఇంకా పెద్ద వేదిక అందించింది.
నబీల్ అఫ్రిదీకి ఈ షోలో సంపాదిస్తున్న రెమ్యూనరేషన్ అతని పాపులారిటీకి తగ్గట్టే చాలా పెద్దది. తాజా సమాచారం ప్రకారం, నబీల్ ప్రతి వారం రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నాడట. బిగ్ బాస్ హౌస్‌లో నబీల్ తన తెలివైన, ఆలోచనాపరమైన గేమ్ ప్లేతో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
టాస్క్‌లను ఆడడంలో, ఇతర కాంటెస్టెంట్స్తో మంచి సంబంధాలను మెయింటెయిన్ చేయడంలో, అలాగే అనవసరమైన గొడవలకు దూరంగా ఉండడం.. ఇవన్నీ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్‌లో పాల్గొనడంతో, నబీల్ పాపులారిటీ మరింత పెరిగింది.
ప్రతి రోజు అతనికి సోషల్ మీడియాలో అనేక మంది కొత్త ఫాలోవర్స్ చేరుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో నబీల్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అతనే ఈ సీజన్లోనే అత్యధికంగా చర్చనీయాంశం అయిన హౌస్ మేట్ అని చెప్పుకోవచ్చు.